తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప'లో నేను భయపడింది దానికే: అల్లు అర్జున్ - dsp

పుష్పరాజ్ పాత్రను దర్శకుడు సుకుమార్ వివరించినప్పుడు మతిపోయిందని చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. క్రిస్మస్ సందర్భంగా 'పుష్ప' చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విశేషాలను బన్నీ పంచుకున్నారు.

pushpa
allu arjun

By

Published : Dec 25, 2021, 2:23 PM IST

'పుష్ప' కథను, పుష్పరాజ్​ పాత్రను దర్శకుడు తనకు చెప్పినప్పుడు మతిపోయిందని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ చివరి నిమిషంలో డైలాగ్​లు మారుస్తుంటారని, అందుకోసమే చిత్తూరు యాసను పూర్తిగా నేర్చేసుకున్నట్లు వివరించారు. క్రిస్మస్​ సందర్భంగా చిత్రబృందం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఎంతో పవర్​ఫుల్​గా ఉండే పుష్ప.. కథానాయిక విషయంలో చాలా అమాయకత్వంతో ఉండటం తనకు చాలా నచ్చిందని చెప్పాడు. పుష్ప పవర్​ తగ్గకుండా అమ్మాయి దగ్గర అమాయకత్వంగా ఉండేలా క్యారెక్టర్​ను డిజైన్ చేసినప్పుడు భయపడినట్లు తెలిపారు బన్నీ.

ABOUT THE AUTHOR

...view details