తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​తో అలియా రొమాన్స్​ - alia bhat

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జంట వెండితెరపై మెరవబోతోంది. సల్మాన్, అలియా కలిసి నటిస్తారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది 'ఇన్షాల్లా' చిత్ర బృందం.

అలియా, సల్మాన్

By

Published : Mar 19, 2019, 5:01 PM IST

Updated : Mar 19, 2019, 9:00 PM IST

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన అలియా భట్ నటించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇన్షాల్లా' సినిమాలో సల్లూమియాతో రొమాన్స్ చేయనుంది అలియా.

దాదాపు 20 ఏళ్ల తర్వాత సల్మాన్, భన్సాలీ కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుని సంతోషాన్ని తెలిపాడీ బాలీవుడ్ హీరో. 'ఇన్షాల్లా' పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

"భన్సాలీతో మళ్లీ పనిచేయడం చాలా ఆనంందంగా ఉంది. అలియాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా" --ట్విట్టర్​లో సల్మాన్

"చివరికి మీరు ఊహించిందే నిజమైంది. భన్సాలీ, సల్మాన్, అలియా కలిసి చిత్రం చేయనున్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు" ---ట్విట్టర్​లో భన్సాలీ ప్రొడక్షన్స్

"భన్సాలీ, సల్మాన్​తో కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తొమ్మిదేళ్ల వయసులో భన్సాలీ ఆఫీసుకు వెళ్లా. ఇప్పుడు ఆయన చిత్రంలోనే నటిస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. షూటింగ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" -ట్విట్టర్​లో అలియా


Last Updated : Mar 19, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details