తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి సినిమాకే ఆలియా సొంత డబ్బింగ్ - RAJAMOULI

ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో హీరోయిన్​ ఆలియా భట్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుంది. అందుకోసం ఓ శిక్షకుడిని నియమించుకుందని సమాచారం.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్న ఆలియా భట్

By

Published : Apr 7, 2019, 1:19 PM IST

టాలీవుడ్​లో నటించే పరభాషా హీరోయిన్లు సాధారణంగా ఇతరుల గొంతుపైనే ఆధారపడుతుంటారు. ఈ మధ్య కాలంలో మాత్రం సొంత వాయిస్​తోనే డబ్బింగ్ చెప్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడా జాబితాలోకి ఆలియా భట్​ చేరింది.​ ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' కోసమే ఇదంతా.

ఎన్టీఆర్, రామ్​చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో గ్రామీణ యువతి సీత పాత్రలో కనిపించనుందీ భామ. తనలోని పూర్తి నటనా సామర్థ్యాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. అందుకే సొంత వాయిస్​తో డబ్బింగ్ చెప్పుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్​వ్యూలో చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది.

తెలుగు నేర్చుకోవడం కొంచెం కష్టమే. కానీ భావాలు వ్యక్తపరిచేందుకు ఇది సరైన భాష. ఇప్పుడిప్పుడే తెలుగును ఎలా పలకాలో నేర్చుకుంటున్నా. ఇలా అయితేనే నా పాత్రకు సంబంధించిన భావాల్ని పూర్తిగా వ్యక్తపర్చగలను -ఆలియా భట్, హీరోయిన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details