'దబాంగ్ 3' సినిమాలో అలీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ వద్ద చిత్రీకరణ సమయంలో....కండల వీరుడితో కలిసి కుటుంబ సమేతంగా ఫొటో తీసుకున్నాడు అలీ. ఇది ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
'చుల్బుల్ పాండే'తో 'సాంబా' ఫ్యామిలీ - దబాంగ్3
దబాంగ్ సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా మూడో భాగం 'దబాంగ్ 3' మొదలెట్టేశారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ఖాన్ పక్కన తెలుగు కమెడియన్ అలీ కనిపించాడు.
'చుల్బుల్ పాండే'తో 'సాంబా' ఫ్యామిలీ
ఈ చిత్రంలో సోనాక్షి సిన్హాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకుడు. సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వాంటెడ్ చిత్రానికి కలిసి పనిచేశారు.