తన సోదరి కోసం ఓ ఛార్టెడ్ విమానాన్ని బుక్ చేశాననే వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ స్టార్హీరో అక్షయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతడి సోదరి అల్కా భాటియా.. తన పిల్లలతో సహా ముంబయి నుంచి దిల్లీకి వెళ్లేందుకు అక్షయ్ ఓ ప్రత్యేక విమానాన్ని బుక్ చేశాడనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"నా సోదరి, ఆమె ఇద్దరు పిల్లల కోసం ఛార్టెడ్ విమానాన్ని బుక్ చేశా'.. అనే వార్తలు అసత్యాలు. లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి తాను ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. మరో విషయమేమిటంటే ఆమెకు ఒక్కరే సంతానం. ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా."
-అక్షయ్ కుమార్, బాలీవుడ్ కథానాయకుడు