తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్లీన్​ షేవ్​లో అజిత్​ను ఎప్పుడైనా చూశారా..!

తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో కనిపించే హీరో అజిత్ గెటప్​ మార్చి క్లీన్ షేవ్​తో.. డీసెంట్ హెయిర్​కట్​తో కనువిందు చేశాడు. ఈ గెటప్​లో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

By

Published : Aug 26, 2019, 9:15 AM IST

Updated : Sep 28, 2019, 7:15 AM IST

అజిత్

తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరో అజిత్. ఈ ఏడాది 'విశ్వాసం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గెటప్ మార్చాడు. క్లీన్ షేవ్​తో ట్రెండీ లుక్​లో దర్శనమిస్తూ.. అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

అజిత్​

ఎప్పుడూ తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో కనిపించే అజిత్.. సహజంగా ఉండటమే ఇష్టమంటూ ఇదే లుక్​లో కనిపిస్తుంటాడు. కథలు వైవిధ్యంగా ఉన్నా.. ఒకే తరహాగెటప్‌తో ఫ్యాన్స్​ను అలరించాడు. ఇప్పుడు గెటప్ మార్చి డీసెంట్ హెయిర్​ కట్​తో సందడి చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈయన బోనీ కపూర్‌ నిర్మాణంలో వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అజిత్‌ను యంగ్‌లుక్‌లో చూపించేలా ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు.

ఇది చదవండి: మహేశ్​ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..!

Last Updated : Sep 28, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details