తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అజయ్​ దేవగణ్​ 'తానాజీ' డబుల్​ సెంచరీ - ఉదయ్​భాన్​ సింగ్​ రాధోడ్​

ప్రముఖ హీరో అజయ్​ దేవగణ్​ కీలక పాత్రలో నటించిన 'తానాజీ' సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి సైన్యాధ్యక్షుడైన తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా 200 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది చిత్రబృందం.

Ajay Devgn's 'Tanhaji..." breaks into Rs 200 crore club
రూ.200 కోట్ల క్లబ్​లో చేరిన 'తానాజీ' చిత్రం

By

Published : Jan 25, 2020, 6:26 PM IST

Updated : Feb 18, 2020, 9:35 AM IST

బాలీవుడ్​ హిట్​ పెయిర్​ అజయ్​ దేవగణ్​​, కాజోల్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'తానాజీ'. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్​ వద్ద రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని నిర్మాణసంస్థ శనివారం ప్రకటించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో డబుల్​ సెంచరీ​ సాధించిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది.

సినిమా విజయవంతం అవడంపై స్పందించిన అజయ్​ దేవగన్​... "తానాజీకి ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని ట్వీట్​ చేశాడు. అతడి భార్య కాజోల్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ... ఈ చిత్రం రూ.250 కోట్ల క్లబ్​లోకి చేరుతుందని ఆశాభావం తెలిపంది. ప్రస్తుతం అజయ్​ దేవగణ్​​ 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ఇదీ చూడండి.. సమీక్ష: 'తానాజీ'.. వసూళ్లపై మెరుపుదాడి చేస్తాడా!

Last Updated : Feb 18, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details