తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రేమ గుణపాఠం నేర్పితే.. విస్కీ నన్ను మార్చింది' - actress Shruti Hassan open up about her alcohol addiction and her breakup with Michael Corsale

అగ్ర కథానాయికగా రాణించిన శ్రుతి హాసన్‌ ప్రస్తుతం మ్యూజిక్‌ షోలతో బిజీగా ఉంది. ఇటీవల కాలంలో తెలుగులో కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయలేదు. ఈ నటి తాజాగా మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ షోలో పాల్గొంది. ఇందులో తనకున్న అలవాట్లు, ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించింది.

ప్రేమ గుణపాఠం నేర్పితే... విస్కీ నన్ను మార్చింది: శృతిహాసన్​

By

Published : Oct 13, 2019, 3:50 PM IST

దక్షిణాది నటి శ్రుతిహాసన్​ తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. విస్కీ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ కొన్ని కారణాల వల్ల విస్కీ తాగడం మానేశానని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌' అనే తెలుగు రియాల్టీ షోలో పాల్గొంది. మంచులక్ష్మి.. "నీకు విస్కీ అంటే ఇష్టమనే విషయం నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నువ్వు విస్కీ తాగడం మానేశావని విన్నాను ఎందుకు?" అని శ్రుతిహాసన్‌ను ప్రశ్నించింది.

ఈ విషయంపై స్పందించిన శ్రుతిహాసన్‌.. "నిజమే.. నాకు విస్కీ అంటే చాలా ఇష్టం. దానిని తాగకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది నాలో ఒక కొత్త మార్పు. నిజం చెప్పాలంటే నాకు ఆరోగ్యం బాగాలేదు. కానీ నేను ఈ విషయాన్ని ఎవరితోను చెప్పలేదు. అనారోగ్యం నుంచి బయటపడేందుకు నేను చికిత్స పొందాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను" అని చెప్పింది.

ఇదే కారణమా..?

శ్రుతి హాసన్‌ లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్టు మైఖెల్‌ కోర్సేల్‌ను ప్రేమించింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ఇద్దరూ పరస్పరం చర్చించుకునే ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. మంచు లక్ష్మి షోలో ప్రేమ వ్యవహారంపైనా స్పందించింది శ్రుతి.

"స్వతహాగా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. చాలా అమాయకురాలిని.. దీంతో నా చుట్టూ ఉన్నవాళ్లు బాస్‌లాగా వ్యవహరిస్తుంటారు. నాకు భావోద్వేగాలు ఎక్కువ. కానీ అతడితో బంధం మాత్రం.. ఓ మంచి అనుభవం. ప్రేమించే వ్యక్తి ఇలా ఉండాలని నాకు నియమాలేమీ లేవు. మంచి వ్యక్తులు మనం సుఖాల్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు. కానీ వారే మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెడ్డ వ్యక్తులుగా మారతారు. అలాగని ప్రేమపై నాకు చెడు అభిప్రాయం లేదు, విరక్తీ కలగలేదు. మొత్తానికి ఇది నాకు పాఠం నేర్పింది. నేను గొప్ప ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్నా.. అతడు నాకు ఎదురైనప్పుడు ఇన్నాళ్లు నేను ఎదురుచూసింది ఈ వ్యక్తి కోసమే అని సంతోషంగా వెల్లడిస్తాను"
-శ్రుతిహాసన్​, సినీ నటి

మళ్లీ జోరు పెంచింది...

2017లో విడుదలైన 'ఎస్​3' సినిమాలో చివరిగా వెండితెరపై కనిపించింది శ్రుతిహాసన్​. ప్రస్తుతం ఈమె 'శభాష్‌ నాయుడు' సినిమాలో నటిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఉంది. ఇందులో కమల్‌ హాసన్‌ కథానాయకుడు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో విజయ్‌ సేతుపతి కథానాయకుడు. ఎస్పీ జననాథన్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details