తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మా కష్టమంతా ఆ ఒక్క క్షణం కోసమే: నటి ప్రణీత

Pranitha Emotional post about actors: నటి ప్రణీత సుభాష్‌ ఆర్టిస్టుల జీవితాల గురించి ఓ భావోద్వేగకరమైన పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది. ఆమె ఏం పెట్టిందంటే?

Actress Pranitha subhash Emotional post
నటి ప్రణీత ఎమోషనల్​ పోస్ట్​

By

Published : Mar 21, 2022, 7:26 PM IST

Pranitha Emotional post about actors: 'అత్తారింటికి దారేది'చిత్రంలో తన అందంతో బాపుబొమ్మగా తెలుగువారికి చేరువైన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌. గుండ్రని కళ్లు, చక్కని చిరునవ్వు.. అంతకుమించిన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచింది. తాజాగా ఈ భామ సోషల్​మీడియా వేదికగా ఎమోషనల్​​ కామెంట్స్​ చేసింది. ఆర్టిస్టుల జీవితాలు కొన్ని సందర్భాల్లో అంధకారంతో నిండి ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్​గా మారింది.

"ఆర్టిస్టులకు సంబంధించిన ఎలాంటి విషయమైనా ఆసక్తిగానే ఉంటాయి. అందుకే ఇలాంటి నిలకడలేని జీవితాలను ఎంచుకుంటాం. ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా శరీరాలను అత్యంత కఠిన పరిస్థితుల్లో పెడతాం. మొత్తంగా మా జీవితాలు కష్టాలు, ఒడుదొడుకులు, కొన్నిసార్లు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్​, ఫెయిల్యూర్​ కాస్త వ్యవధిలోనే చూస్తాం. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ కూర్చుంటాం, లేస్తాం, తింటాం, పడుకుంటాం. అయినా మేం గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. అనారోగ్య కరమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటాం. పగలు, రాత్రి అని తేడా లేకుండా చలికి వణుకుతూ.. వర్షంలో తడుస్తూ.. ఎండలో ఎండుతూ పని చేస్తుంటాం. మా సామర్థ్యానికి మించి పని చేస్తాం. ఇదంతా చేసేది ఓ ఆర్ట్​, మంచి బ్రేక్​ పాయింట్​, సంతోషపెట్టే ఓ క్షణం కోసమే."

-నటి ప్రణీత.

'పోర్కీ'(పోకిరి కన్నడ వెర్షన్‌) చిత్రంతో ప్రణీత కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. 'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత తెలుగులో తెరకెక్కిన చాలా సినిమాల్లో కథానాయికగానే కాకుండా సెకండ్‌ లీడ్‌గా కూడా కనిపించారు. 'అత్తారింటికి దారేది', 'రభస', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'బ్రహ్మోత్సవం', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ఆమె ఏడడుగులు వేశారు.

ఇదీ చూడండి: మళ్లీ హాట్​టాపిక్​గా సామ్​.. ఆ విషయంలో చైతూని పక్కనపెడుతూ..

ABOUT THE AUTHOR

...view details