విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడం వల్లే ప్రేక్షకుల్లో తనకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ప్రముఖ సీనియర్ నటులు సాయిచంద్ అన్నారు. 'ఫిదా', 'సైరా' తర్వాత 'ఉప్పెన'లో కథానాయకుడి తండ్రి పాత్రలో నటించిన సాయిచంద్.. చిరంజీవి విజ్ఞప్తి మేరకే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ తండ్రిగా నటించానని స్పష్టం చేశారు. అయితే ఆ చిత్రంలో నటించేటప్పుడు వైష్ణవ్‌తో చేసిన సన్నివేశాల్లో ఎంతో లీనమయ్యానని, ఒక సన్నివేశంలో స్పృహ తప్పి పడిపోయానని వివరించారు.
'చిరు విజ్ఞప్తి మేరకే ఆ పాత్రలో నటించా'
చిరంజీవి విజ్ఞప్తి మేరకే 'ఉప్పెన' చిత్రంలో వైష్ణవ్ తేజ్ తండ్రిగా నటించినట్లు తెలిపారు ప్రముఖ సీనియర్ నటులు సాయిచంద్. వైష్ణవ్ చాలా క్రమశిక్షణ కలిగిన కుర్రాడని అన్నారు. కాగా, 'చెక్' చిత్రం సినీ పరిశ్రమలో మరో మంచి ప్రయత్నమన్నారు. ఆయన ఈ సినిమాలో నితిన్‌కు చదరంగం నేర్పించే గురువు పాత్రలో నటించినట్లు వెల్లడించారు.
తాను సెట్లో ఉన్నప్పుడు వైష్ణవ్ ఎప్పుడు తన పక్కన కూర్చోలేదని, ఎంతో గౌరవం చూపించేవాడని సాయిచంద్ తెలిపారు. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించిన 'చెక్' సినిమా కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందన్నారు. చెక్‌లో నితిన్‌కు చదరంగం నేర్పించే గురువు పాత్రలో నటించినట్లు తెలిపిన ఆయన.. చెక్ సినిమా సినీ పరిశ్రమలో మరో మంచి ప్రయత్నమన్నారు. చిరంజీవితోపాటు తనకు ఒక సారూప్యత ఉందని చమత్కరించిన సాయిచంద్.. సినిమా ముందస్తు విడుదల వేడుకలకు హాజరుకావాలంటే భయమేస్తుందన్నారు.
ఇదీ చూడండి: 'తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం'