కథానాయకుడు రవితేజ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. 'క్రాక్' చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన.. ఈలోపే 'ఖిలాడి' చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. మరో కీలక పాత్ర కోసం బుల్లితెర అందం అనసూయను ఎంపిక చేసినట్లు సమాచారం.
రవితేజ 'ఖిలాడి'లో అనసూయ కీలకపాత్ర! - ravi teja with two heroines
కథానాయకుడు రవితేజ తదుపరి చిత్రం 'ఖిలాడి'. ఇందులో మాస్ మహారాజా సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేయనున్నారు. మరో కీలక పాత్ర కోసం బుల్లితెర యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఖిలాడీలో ఆ ఇద్దరి భామలతో పాటుగా మరో అందం
రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. దీంట్లో అనసూయ పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె 'ఆచార్య', 'రంగమార్తాండ' వంటి బడా చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యనారాయణ కొనేరు నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:ఇద్దరు ముద్దుగుమ్మలతో 'ఖిలాడి' రవితేజ