తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భయపెట్టేందుకు సిద్ధమైన 'అభినేత్రి-2' - అభినేత్రి-2

హారర్ సినిమా 'అభినేత్రి-2'లో తమన్నా, ప్రభుదేవా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

భయపెట్టేందుకు సిద్ధమైన 'అభినేత్రి-2'

By

Published : May 21, 2019, 5:00 AM IST

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా 'అభినేత్రి'. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన 'అభినేత్రి- 2' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. నందితా శ్వేత, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. మొదటి భాగాన్ని తీసిన విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వహించాడు. అభిషేక్ నామా, ఆర్‌.ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మించారు.

అభినేత్రి-2 సినిమా పోస్టర్

"మొదటి సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తున్న 'అభినేత్రి' అందరినీ అల‌రిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేత నటన చిత్రానికి హైలైట్. ఈ నెల 31న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం'' అని దర్శకుడు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details