తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మాయి నో చెప్పిందని ఆమిర్ ఏం చేశాడంటే..!

బాలీవుడ్​ మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రేమలో విఫలమయ్యాడట. ఓ అమ్మాయి నో చెప్పిందని ఒకప్పుడు గుండు కొట్టించుకున్నాడట.

ఆమిర్

By

Published : Jun 11, 2019, 8:00 AM IST

ప్రేమ.. ఓ మధురానుభూతి. మరి అది విఫలమైతే ఆ బాధను తట్టుకోవడం కాస్త కష్టమే. అలా తమ బాధను దిగమింగుకోలేని వారు పాల్పడే చర్యలు కొన్ని సార్లు అయ్యో పాపం అనిపిస్తే... మరికొన్ని సార్లు విచిత్రంగా నవ్వు తెప్పిస్తాయి.

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ చేసిన పని కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయి నచ్చి తన ప్రేమ విషయాన్ని చెప్పాడట. అయితే ఈ మిస్టర్ పర్​ఫెక్ట్ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు.. మూడు సార్లు ముగ్గురు అమ్మాయిలతో నో అనిపించుకున్నాడు ఆమిర్‌. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగోసారీ ప్రేమించాడట. కానీ ఆ అమ్మాయి కూడా కాదంది.

గుండెల నిండా దుఃఖం ఆవరించగా, ఏం చేయాలో పాలుపోని స్థితిలో సరాసరి సెలూన్‌కు వెళ్లి గుండు కొట్టించుకున్నాడట ఆమిర్. అసలు ఆ పని ఎందుకు చేశానో తెలియదని, ఇప్పుడు తల్చుకుంటే తనది ఎంత మూర్ఖత్వమో అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే టీనేజ్‌ ప్రేమలు విఫలమైనా తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి కథానాయుకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవడమే కాదు.. ప్రేమలోనూ విజయం సాధించి కిరణ్‌రావ్‌ను పెళ్లి చేసుకున్నాడు ఆమిర్‌.

ఇవీ చూడండి.. ప్రభాస్ ఫ్యాన్స్​కు ఈనెల 13న అదిరే గిఫ్ట్​

ABOUT THE AUTHOR

...view details