బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు నటుడు అనుపమ్ శ్యామ్ ఓజా సోదరుడు అనురాగ్ శ్యామ్. తమకు సహాయం చేస్తానని చెప్పిన ఆమిర్.. ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆమిర్ మాట తప్పారా?
కిడ్నీ వ్యాధి సహా ఇతర అవయవాలు విఫలమై ఈ నెల 8న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో అనుపమ్ మృతి చెందారు. అయితే అతడికి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆమిర్ గతంలో హామీ ఇచ్చినట్లు అనురాగ్ తెలిపారు.
"అనారోగ్యంతో మా అమ్మ గత నెలలో మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉన్న ఆమెను చూడటానికి వెళ్లలేకపోయినందుకు అనుపమ్ ఎంతో బాధపడేవారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం లేదు. కాబట్టి, అక్కడికి వెళ్తే ఆయన ప్రాణాలకే ముప్పు. ఈ నేపథ్యంలో ఆమిర్ సహాయం కోరగా.. ప్రతాప్‌గఢ్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ అప్పటి నుంచి మేము చేసే ఫోన్లకు స్పందించడం మానేశారు."
-అనురాగ్ శ్యామ్, అనుపమ్ సోదరుడు
మన్‌కీ ఆవాజ్: ప్రతిజ్ఞ అనే కార్యక్రమం ద్వారా అనుపమ్ చాలా పాపులర్. అదే కాక స్లమ్‌డాగ్ మిలీనియర్, బండిట్ క్వీన్, దిల్సే, ఆమిర్ 'లగాన్' చిత్రం సహా అనేక చిత్రాల్లో నటించారు అనుపమ్.
ఇదీ చూడండి:అభిమానులూ సిద్ధం కండి.. పవర్‌స్టార్ నుంచి భారీ అప్డేట్స్!