తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశా' - ఆమిర్ ఖాన్

కూతురు ఇరా ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి ఫొటోను పంచుకున్నాడు ప్రముఖ బాలీవుడ్​ నటుడు ఆమిర్ ఖాన్.

'ఆ విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశా'

By

Published : May 10, 2019, 9:29 PM IST

ఆమిర్‌ ఖాన్‌ ముద్దుల తనయ ఇరా జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ఆరేళ్ల వయసు ఉన్న ఫొటోను షేర్‌ చేశాడీ హీరో.

‘‘నేను ‘మంగళ్‌ పాండే’ సినిమాలో నటిస్తున్నప్పుడు నీ వయసు 6 సంవత్సరాలు. అప్పుడే నువ్వు 21 వసంతాలు పూర్తి చేసుకున్నావు. చాలా తొందరగా ఎదిగిపోయావు’’ ఇన్​స్టా​లో ఆమిర్ ఖాన్.

ఇన్​స్టాలో ఆమిర్ ఖాన్

గతంలో జరిగిన ఓ ముఖాముఖిలో ఇరా సినిమాల్లో నటిస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘ఆమె ఇష్టానికే అన్నీ వదిలేశా. ఆమె ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఫిలిం మేకింగ్‌ అంటే ఇష్టం ఉందనుకుంటా’’ అని ఆమిర్‌ సమాధానమిచ్చాడు. ఈ బాలీవుడ్ కథానాయకుడు తాజాగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ 2020 క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ABOUT THE AUTHOR

...view details