తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 12:19 PM IST

Updated : Dec 4, 2019, 12:25 PM IST

ETV Bharat / sitara

ఫస్ట్​లుక్: వేశ్యగా టబు.. ఇషాన్‌తో రొమాన్స్‌

టబు, ఇషాన్ ఖత్తర్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఎ సూటబుల్ బాయ్'. మీరా నాయర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకునేలా ఉంది.

'A Suitable Boy'
టబు

బాలీవుడ్‌ నటి టబు వేశ్యగా నటిస్తోన్న చిత్రం 'ఎ సూటబుల్‌ బాయ్‌'. మీరా నాయర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇషాన్‌ ఖత్తర్‌ రాజకీయ నాయకుడి కుమారుడిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో టబు పసుపురంగు దుస్తులతో తల్లో మల్లెపూలు పెట్టుకుని ఉండగా, ఇషాన్‌.. టబు వైపు చూస్తున్న దృశ్యం ఆకట్టుకునేలా ఉంది.

ప్రముఖ రచయిత విక్రమ్‌ సేథ్‌ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో టబు సైదాబాయి అనే వేశ్య పాత్రలో నటిస్తుండగా, 'దఢక్‌' నటుడు ఇషాన్‌ రాజకీయ నాయకుడి కుమారుడిగా, సైదాబాయికి దగ్గరయ్యే పాత్రలో కనిపించనున్నాడు.

వేశ్యగా టబు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం లఖ్​నవూ నగరంలోని రాజభవనాల్లో, మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరించారు. టబు గతంలో మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ది నామ్‌ సేక్‌' సినిమాలో నటించింది.

ఇవీ చూడండి.. 'ఆ పాట తప్పుగా అర్థమైందేమో అనిపించింది'

Last Updated : Dec 4, 2019, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details