సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్. 'జీరో' చిత్రం తర్వాత మరో సినిమా చేయని ఇతడు ఇప్పుడు నాలుగు సినిమాలతో రానున్నట్టు తెలుస్తోంది. అది కూడా సరికొత్త కాంబోలో.. ఇంతకు ముందు కలిసి పనిచేయని దర్శకులతో చేయనున్నాడు షారుక్.
సిద్ధార్థ్ ఆనంద్:
ప్రస్తుతం షారుక్.. 'పఠాన్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఆయన ఇదివరకు హృతిక్‌తో 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలు చేశాడు. యాక్షన్ సినిమాలను స్టైలిష్‌గా తెరకెక్కించే ఈ దర్శకుడితో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.
రాజు హిరాణీ:
బాలీవుడ్లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కలయిక రాజు హిరాణీ-షారుక్. 'పఠాన్' పూర్తవగానే జూన్‌లో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు కింగ్ ఖాన్.