Threads New Feature : థ్రెడ్స్ యాప్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు థ్రెడ్స్ యాప్‌లో కేవలం 30 రోజుల్లోనే పోస్టులు ఆటో డిలీట్ అయ్యేలా సెట్టింగ్ ఉండేది. కానీ ఇప్పుడు యాప్‌లోని పోస్టులు 90 రోజుల తరువాత మాత్రమే ఆటో-డిలీట్ అయ్యేలా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది.
Threads craze Instagram : ఇన్స్టాగ్రామ్ అనుబంధ మెసేజింగ్ యాప్ థ్రెడ్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌నే సవాల్ చేస్తూ కేవలం రిలీజ్ అయిన గంటల్లోనే 10 మిలియన్ యూజర్ బేస్‌ను సంపాదించుకుంది. అంతే కాదు.. ఈ నయా మెసేజింగ్ యాప్ ఇప్పటి వరకు 100 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో.. వెబ్, యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Threads app to soon feature auto delete posts : మెటా కంపెనీకి చెందిన థ్రెడ్స్ యాప్‌ను.. ఇన్‌స్టాగ్రామ్‌కు అనుబంధంగా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ట్విట్టర్‌కు పోటీగా ఈ సరికొత్త సామాజిక మాధ్యమాన్ని తీసుకువచ్చినట్లు పబ్లిక్ టాక్. ఇది అందరికీ తెలిసిన విషయమే.
థ్రెడ్స్ యాప్‌లో పెట్టిన టెక్ట్స్ పోస్టులపై.. యూజర్లు లైక్, కామెంట్ చేయవచ్చు. అదే విధంగా ఆ పోస్టులను రీపోస్ట్ చేయగలరు. షేర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ థ్రెడ్స్ యాప్‌లోని పోస్టులు కేవలం 30 రోజులు మాత్రమే కనిపిస్తాయి. తరువాత అవి ఆటో-డిలీట్ అవుతాయి. ఇది యూజర్లకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే థ్రెడ్స్ ఇప్పుడు ఈ ఆటో-డిలీట్ ఫీచర్‌ను 90 రోజులకు పెంచే విధంగా ఆలోచన చేస్తోంది. త్వరలో ఇది సాకారమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి స్పష్టం చేశారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్‌తోనే..
థ్రెడ్స్ యాప్‌ను ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్‌తోనే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫాలో అవుతున్నవారినే ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. ట్విట్టర్లో టెక్ట్స్ సైజు కేవలం 280 పదాలు మాత్రమే ఉండగా, థ్రెడ్స్‌లో అక్షరాల పరిమితి 500 వరకు ఉంది. ఇది యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ట్విట్టర్ వర్సెస్ మెటా
Twitter vs Threads : ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్‌కు మంచి ఆదరణ లభిస్తున్న వేళ.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. మెటా కంపెనీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మెటా తమ మాజీ ఉద్యోగుల ద్వారా ట్విట్టర్ వాణిజ్య పరమైన రహస్యాలను దొంగిలించిందని ఆరోపించారు. అలాగే మేథోపరమైన హక్కులను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. దీనిపై తాను న్యాయస్థానంలో పిటిషన్ వేస్తానని మస్క్ స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలను మెటా ప్రతినిథి ఆండీ స్టోన్ తోసిపుచ్చారు.