Tesla self driving car: ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ 'టెస్లా'. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా.. మరోసారి వాహనాల ఉత్పత్తిలో సంచలనాత్మక మార్పులు తీసుకురాబోతోంది. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్(ఎస్డీఎస్) అనే సరికొత్త సాంకేతికతో డ్రైవర్ రహిత వాహనాలను అందుబాటులోకి తేనుంది.
ఈ సాంకేతికత ద్వారా డ్రైవర్ అవసరం లేకుండానే కారు దానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం అమెరికాలో 60వేల వాహనాలపై ఈ ఎస్డీఎస్ సాఫ్ట్వేర్ను టెస్ట్ చేస్తున్నారు.
కెనడాలోనూ సాఫ్ట్వేర్ టెస్టింగ్..