Samsung Galaxy F23 5G: మీడియం రేంజ్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్. గ్యాలక్సీ ఎఫ్23 5జీ మోడల్‌ను సోమవారం విడుదల చేసింది. తొలిసారి స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 120హెర్జ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే వంటి ఆకర్షణీయ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించింది. గ్యాలక్సీ ఎఫ్22కు కొనసాగింపుగా వచ్చిన ఈ గ్యాలక్సీ ఎఫ్23 5జీలోని మిగిలిన ఫీచర్లు సహా దీని ధరలు ఇలా ఉన్నాయి.
ఫీచర్లు
- స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్
గ్యాలక్సీ ఎఫ్ సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో వచ్చిన తొలి ఫోన్ గ్యాలక్సీ ఎఫ్23 5జీ. దీంతో మునుపెన్నడూ లేనంత వేగంగా మల్టీటాస్కింగ్, గేమ్‌లను ఆడుకోవచ్చు.
- 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ 120 హెర్జ్ డిస్ప్లే
- 50+8+2 ఎంపీ ప్రైమరీ కెమేరా
- 13 ఎంపీ సెల్ఫీ కెమేరా
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ (25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్)
ధర
4 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,499