హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ జోరుమీదుంది. ఏప్రిల్లోనే మూడు కొత్త నోకియా ఫోన్లను లాంచ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా మంగళవారం మరో మూడు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నోకియా ఎక్స్ఆర్20, నోకియా 6310, నోకియా సీ30 పేరుతో ఈ సరికొత్త ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. మరి వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
నోకియా ఎక్స్ఆర్ 20 ఫీచర్లు...
- 6.67 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్
- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- వెనుకభాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 4,630 ఎంఏహెచ్ బ్యాటరీ(18 వాట్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ)
అల్ట్రా బ్లూ, గ్రానైట్ రంగుల్లో ఈ మొబైల్ లభించనుంది. 4జీబీ ర్యామ్/64జీబీ మెమొరీ వేరియంట్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమొరీ వేరియంట్లు ఉన్నాయి. ధర రూ. 43, 810గా ఉంది.
నోకియా సీ30 ఫీచర్లు..
- 6.82 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- ఆక్టా కోర్ ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్
- 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా
- 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ