200MP Smartphone: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఫోన్‌ను తీసుకురానుంది మొటోరోలా. తొలిసారి 200మెగా పిక్సెల్ కెమెరాతో కొత్త మోడల్‌ను రూపొందిస్తోంది. 'మొటోరోలా ఫ్రంటియర్'గా పేరు పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ జులైలో మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ఇప్పటికే తెలిపింది. చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 200 మెగా పిక్సెల్ కెమెరాతో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతి ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది.
సామ్సంగ్ అభివృద్ధి చేస్తోన్న 200MP ISOCELL HP1 సెన్సార్‌ను ఈ ఫోన్లో ఉపయోగించనుంది మొటోరోలా. ఈ సెన్సార్ 8K వీడియో రికార్డింగ్‌ను 30fpsతో సపోర్ట్ చేస్తుంది. స్నాప్ డ్రాగ్ 8 జెన్ 1ప్లస్ ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మొటోరోలా ఇటివలే ప్రకటించింది. ఈ ఫోన్లోనే 200MP కెమెరాను అమర్చనున్నట్లు తెలుస్తోంది. 8 లేదా 12 జీబీ రామ్, 128/256 జీబో రోమ్తో ఈ ఫోన్ రానుంది. బ్యాటరీ సామర్థ్యం 4500ఎంఏహెచ్. 125వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 30వాట్స్, 50వాట్స్ రేంజ్‌తో వైర్లెస్ ఛార్జింగ్‌ను కూడా ఈ సూపర్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.