తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ట్రిపుల్​ కెమెరా, 16నిమిషాల్లో బ్యాటరీ ఫుల్​ ఛార్జ్!​.. iQOO Neo 7 Pro లాంఛ్ అప్పుడే.. - latest smartphone updates

iQOO Neo 7 Pro launch : ఐకూ నియో 7 ప్రో స్మార్ట్​ఫోన్​ను జులై 4న భారత మార్కెట్​లో లాంఛ్​ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించిది. ముఖ్యంగా ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8+జెన్​ ప్రోసెసర్​, ట్రిపుల్​ కెమెరా సెటప్​, 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ నయా ఫోన్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధర వివరాలు మీకోసం.

iQOO neo 7 Pro launch on july 4
iQOO neo 7 Pro features and specifications

By

Published : Jun 17, 2023, 4:05 PM IST

Updated : Jun 17, 2023, 4:35 PM IST

iQOO Neo 7 Pro launch : ఐకూ ఫోన్​ అభిమానులకు అదిరిపోయే న్యూస్​. 'ఐకూ నియో 7 ప్రో' స్మార్ట్​ఫోన్​లోని కీలకమైన స్పెసిఫికేషన్స్​ను ఐకూ వెల్లడించింది. భారత మార్కెట్​లోకి ఈ నయో ఫోన్​ లాంఛ్​ చేయడానికి ముందే.. ఇలా అందులోని కీ స్పెసిఫికేషన్స్​ను ఐకూ నిర్ధరించడం విశేషం. ఐకూ నియో 7 ప్రో స్మార్ట్​ఫోన్​ 2023 జులై 4న భారత మార్కెట్​లో లాంఛ్​ కానుంది. ఇప్పటికే వీగన్ లెదర్​ బ్యాక్​తో, ఆరెంజ్ కలర్​ డిజైన్​తో ఊరిస్తోంది. ఈ ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ కూడా పొందుపరిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఐకూ నియో 7 ప్రో స్పెసిఫికేషన్స్​
iQOO neo 7 Pro specifications: ఐకూ నియో 7 ప్రోలో.. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8+ ప్రొసెసర్​ను పొందుపరిచినట్లు ఐకూ నిర్ధరించింది. ఇందులో ఇండిపెండెంట్​ గేమింగ్​ చిప్​ను కూడా అమర్చినట్లు స్పష్టం చేసింది. ఈ డెడికేటెడ్​ చిప్​ వల్ల హై గ్రాఫిక్స్​, ఎలివేటెడ్ గ్రాఫిక్స్​లో ఆడినప్పటికీ.. మంచి గేమింగ్​ అనుభవం కలుగుతుందని ఐకూ వెల్లడించింది.

ఈ స్మార్ట్​ఫోన్​కు 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా ఉంది. దీని వల్ల కేవలం 8 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీని రీఛార్జ్​ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఐకూ నియో 7 స్మార్ట్​ఫోన్​కు కూడా ఇదే 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​ ఉంది.

ప్రస్తుతానికి ఐకూ కంపెనీ ఈ నయా స్మార్ట్​ఫోన్​లోని బ్యాటరీ కెపాసిటీని వెల్లడించలేదు. చైనాలో విడుదల చేసిన నియో 7 రేసింగ్​ ఎడిషన్​ ఉన్నట్లుగానే ఐకూ నియో 7 ప్రో ఉండొచ్చని మార్కెట్​ వర్గాల అంచనా. ఒక వేళ అదే నిజమైతే.. ఒన్​ప్లస్​ 11ఆర్​, వివో వీ27 ప్రో స్మార్ట్​ఫోన్​లతో పాటు.. త్వరలో లాంఛ్​ కానున్న నథింగ్​ ఫోన్​ 2 కూడా క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ ప్రోసెసర్​ కలిగి ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఐకూ నియో 7 ప్రో కలర్​ వేరియంట్స్

ఐకూ నియో ప్రో ఫీచర్స్​ అండ్​ స్పెసిఫికేషన్స్​

  • డిస్​ప్లే : 6.78 ఇంచీ అమోలెడ్​ డిస్​ప్లే+ ఫుల్​ హెచ్​డీ + 120హెచ్​జెడ్​ రిఫ్రెస్​ రేట్​
  • రియర్​ కెమెరా : 50 మెగా పిక్సెల్ మెయిన్​ కెమెరా + 8ఎమ్​ఎమ్​+2ఎమ్​ఎమ్​
  • ఫ్రెంట్ కెమెరా : 16 మెగా పిక్సెల్​
  • బ్యాటరీ : 5000ఎమ్​ఏహెచ్ బ్యాటరీ
  • ర్యామ్​ : 8జీబీ
  • స్టోరేజ్​ : 256 జీబీ
  • ఓఎస్​ :ఆండ్రాయిడ్​ 13

iQOO Neo 7 Pro Price : భారత మార్కెట్​లో ఐకూ నియో 7 ప్రో స్మార్ట్​ఫోన్​ ధర సుమారు రూ.38,000 నుంచి రూ.42,000 మధ్యలో ఉండవచ్చని మార్కెట్​ వర్గాల అంచనా వేస్తున్నాయి.

Last Updated : Jun 17, 2023, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details