Best 5g phones under 15000 :సెల్‌ఫోన్ చేతిలో లేనిదే ప్రస్తుత కాలంలో రోజు గడవట్లేదు. 5జీ నెట్వర్క్ సర్వీసులు బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, తప్పకుండా అందరూ 5జీ ఫోన్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. 5జీ ఫోన్లు కొనేందుకు భారీ బడ్జెట్ అవసరం కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో రూ.15 వేల లోపు 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
Samsung Galaxy M14 5G
మొబైల్ లవర్స్‌కు బడ్జెట్లో అందుబాటులో ఉన్న మంచి 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్14. దక్షిణ కొరియా బ్రాండ్ అయిన శాంసంగ్ ఈ బడ్జెట్ ఫోన్లో అనేక మంచి ఫీచర్స్‌ను పొందుపరిచింది. ముఖ్యంగా గొరిల్లా గ్రాస్ 5 డిస్ప్లే, 6000 ఎమ్హెచ్ బ్యాటరీతో, 25 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో ఇది వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్స్‌తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోన్ ధర మార్కెట్లో రూ.14,990గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ ఫీచర్స్ :
⦁డిస్ప్లే :6.6 ఇంచీలు, హెచ్డీ+ డిస్ప్లే
⦁ ప్రోసెసర్: శ్యాంసంగ్ ఎక్సినోస్ 1330
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 128జీబీ
⦁ రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 13ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13 ఓన్ యూఐ కోర్ 5.1
⦁ బ్యాటరీ : 6000 ఎమ్ఏహెచ్
iQOO Z6 Lite 5G
ఐకూ జెడ్6 లైట్ 5జీ రెండు అదిరిపోయే రంగుల్లో లభిస్తోంది. ఇది చాలా స్టైలిష్‌గా చాలా స్లిమ్‌గా అంటే 8.22ఎమ్ఎమ్ థిక్‌నెస్‌తో ఉండి మన జేబులో చక్కగా ఇమిడిపోతుంది. ఇది 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో, 18వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.13,999గా ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫీచర్స్ :
⦁ డిస్ప్లే : 6.58 ఇంచీలు, 120హెచ్‌జెడ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే
⦁ ప్రోసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్1
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 64జీబీ
⦁ రియర్ కెమెరా :50ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 8ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ :ఆండ్రాయిడ్ వీ 12
⦁ బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
SAMSUNG Galaxy M13
కచ్చితంగా బడ్జెట్లోనే 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. అయితే ఇది ప్లాస్టిక్ బాడీతో, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 ధర రూ.12,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 13 ఫీచర్స్ :
⦁ డిస్ప్లే : 6.6 ఇంచీలు, ఎఫ్‌హెచ్‌డీ+, 1080x2408 పిక్సల్ రిజల్యూషన్
⦁ ప్రోసెసర్ : ఎక్సినోస్ 1280
⦁ర్యామ్ : 6జీబీ
⦁ స్టోరేజ్ : 128జీబీ, 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ వయా మైక్రోఎస్డీ