తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Putin india visit: చిరకాల మిత్రుల సహకార సవారీ - s 400 missiles

Putin india visit: కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన తరవాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ కోసం జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జెనీవా వెళ్లిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, రెండో పర్యటనగా భారత్‌ను ఎంచుకున్నారు. ఈ పర్యటనలో భారత్‌, రష్యా మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఆర్థిక ప్రయోజనాలే కాదు, హార్దిక ప్రాథమ్యాలూ మిళితమై ఉన్నాయి. మాస్కో, దిల్లీల సౌభ్రాతృత్వానికి దర్పణం పట్టే అంశాలూ ప్రధాని మోదీ, పుతిన్ మధ్య చర్చకు వచ్చాయి.

Putin india visit, India russia relations
భారత్ రష్యా సంబంధాలు

By

Published : Dec 13, 2021, 6:41 AM IST

Putin india visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజా దిల్లీ పర్యటన అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన తరవాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ కోసం జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జెనీవా వెళ్లిన పుతిన్‌, రెండో పర్యటనగా భారత్‌ను ఎంచుకున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఇంటా బయటా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ 19 సార్లు కలుసుకున్నారు. పాత చెలిమికి కొత్త చిగుళ్లను తొడగాలన్న బృహత్సంకల్పం ఇరు దేశాధినేతల తాజా ద్వైపాక్షిక వార్షిక సదస్సు సంయుక్త ప్రకటనలో ప్రస్ఫుటమైంది. శాంతి, సుస్థిరత, పరస్పర ఆర్థిక వృద్ధికోసం, సైనిక సాంకేతిక పరిశోధన రంగాల్లోనూ ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించడం గొప్ప ముందడుగు.

ఉమ్మడిగా ఉత్పత్తి

India russia relations: 'తన అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేవారినే మిత్రులుగా/ భాగస్వాములుగా ఎంచుకోవాలి' అన్న పుతిన్‌ వ్యాఖ్య- దిల్లీ, క్రెమ్లిన్‌ల మధ్య ఎడం తగ్గాలన్న సంకేతాలిచ్చింది. 'విశిష్ట వ్యూహాత్మక భాగస్వామితో కలిసి ఈరోజు వేసిన అడుగులు మున్ముందు కొంగొత్త రంగాల్లో సహకారానికి బీజం వేస్తా'యని ప్రధాని మోదీ అభిలషించారు. అంతకుముందు ఇరుదేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు సెర్గీ లావ్రోయ్‌, సెర్గీ షోయిగు; రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌ల 2+2 భేటీ జరిగింది. ఆ తరవాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా జారీచేసిన ప్రకటనలో 'సైనిక సహకారంతో పాటు సాయుధ సంపత్తిని సుసంపన్నం చేసేందుకు, సాంకేతికతను బదలాయించేందుకు రష్యా ముందుకురావడం మన మిత్రత్వానికి నిదర్శన'మని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:భారత్​ను విస్మరించిన అమెరికా- రష్యానే కారణం!

'కాట్సా' అంశం జోలికి వెళ్లకుండానే..

India russia deal of s400: ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సు ఒప్పందం మేరకు ఈ నెలలోనే అత్యంత అధునాతన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు రష్యానుంచి భారత్‌కు రానున్నాయి. వాటి కొనుగోలుపై అమెరికా 'కాట్సా' ఆంక్షలు విధిస్తుందా లేదా అన్న అంశం జోలికే వెళ్ళలేదు. ఆరు లక్షల ఏకే-203 అసాల్ట్‌ రైఫిళ్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా తొలుత 70 వేల తుపాకులను దిగుమతి చేయనున్న రష్యా- అనంతరం సాంకేతికతనూ బదిలీ చేసి అమేఠీలో నెలకొల్పనున్న ఆయుధ కర్మాగారంలో ఉమ్మడిగా ఉత్పత్తిని ప్రారంభించనుంది. తద్వారా భారత్‌ కొనుగోలుదారు స్థితి నుంచి తయారీ భాగస్వామిగా ఎదగడం కీలక పరిణామం. 1971లో మొదలైన ఇరుదేశాల శాంతి సహకార ఒప్పందానికి స్వర్ణోత్సవం జరుపుకొంటున్న వేళ- ఇది చిరకాల మిత్రుడి నుంచి అందిన ఆయుధ కానుక.

హార్దిక ప్రాథమ్యాలూ మిళితమై..

India-russia defence projects: భారత్‌, రష్యా మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఆర్థిక ప్రయోజనాలే కాదు, హార్దిక ప్రాథమ్యాలూ మిళితమై ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు సర్కారు, ప్రైవేటు సంస్థలకూ ఒప్పందాల్లో ప్రాతినిధ్యం దక్కింది. రక్షణ సామగ్రి, అంతరిక్ష, అణుపాటవ పరిజ్ఞానాన్నీ భారత్‌కు రష్యా అందించనుంది. చమురు, సహజవాయు, పెట్రోకెమికల్స్‌, బొగ్గు, రసాయనాలు, ఎరువుల తయారీ, పరిశోధన రంగాల్లో పరిజ్ఞానాన్ని ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. సైబర్‌ భద్రత, డేటా బదలాయింపుపైనా ఒప్పందాలు కుదిరాయి. ఒకనాటి పట్టు రహదారిని పునరుద్ధరించే దిశగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌కు ప్రత్యామ్నాయంగా వ్లాదివొస్తాక్‌-చెన్నై తూర్పు సముద్ర నడవాను పట్టాలెక్కించడంపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో జరిగే 'వైబ్రంట్‌ గుజరాత్‌' సదస్సులో దానిపై రష్యా ప్రతినిధి బృందం చర్చించనుంది. మాస్కో, దిల్లీల సౌభ్రాతృత్వానికి దర్పణం పట్టే అంశాలూ చర్చకు వచ్చాయి.

ఇదీ చూడండి:India Russia relations: చిరకాల మైత్రికి కొత్త ముడి

స్నేహ బంధం సడలకుండా...

India russia on afghanistan: సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత వాషింగ్టన్‌కు దిల్లీ చేరువైంది. చిరకాల స్నేహానికి విఘాతం కలగకుండా ఇండియా, రష్యాలు లౌక్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల ఇండో పసిఫిక్‌ సముద్రంలో చైనా దూకుడుపై రష్యా సానుకూల వైఖరి, భారత్‌ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా పాక్‌, అఫ్గాన్‌లతో సంబంధాలు నెరపడం ఇరు దేశాల మధ్య ప్రధాన వైరుధ్యాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాల గురించీ దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికాను నిలువరించగలదన్న అంచనాలు, వ్యాపార, వాణిజ్య అవసరాలవల్లనే బీజింగ్‌కు రష్యా చేరువవుతోందన్నది మాస్కో వర్గాల విశ్లేషణ. అఫ్గాన్‌లో తాలిబన్లను వ్యతిరేకించినా ప్రయోజనం లేనందువల్ల వారి ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, అక్కడి ఉగ్రకార్యకలాపాలు తన సరిహద్దు దేశాలకు విస్తరించకుండా చూడటమే రష్యాకు కీలకంగా మారింది. భారత్‌ మాత్రం అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని, అక్కడి పౌరులను మానవతా సంక్షోభంనుంచి గట్టెక్కించాలని ప్రయత్నిస్తోంది. ఈ సంక్లిష్టతల నడుమ పాత చెలిమిని కాపాడుకునేందుకు పుతిన్‌ గట్టి సంకల్పంతో ఉన్నట్లు అవగతమవుతోంది. గతంలో రష్యాపై ఆధారపడిన భారత్‌- నేడు ఇచ్చిపుచ్చుకొనే దశకు ఎదిగింది. కొవిడ్‌ మొదటి దశ ఉద్ధృతిలో మందులు, వైద్యసామగ్రిని విస్తృతంగా రష్యాకు అందించింది. రెండో దశలో అక్కడినుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, మందులను దిగుమతి చేసుకుంది. క్రెమ్లిన్‌, దిల్లీల సహకారం అన్ని రంగాలకూ విస్తరిస్తే స్నేహబంధం పటిష్ఠం కావడంతోపాటు ఇరు దేశాలకూ ఉభయతారకంగా ఉంటుంది.

- బోండ్ల అశోక్‌

ఇవీ చూడండి:

పాక్​ కుయుక్తులతో సార్క్‌ భవితపై నీలినీడలు

China tibet rail poject: డ్రాగన్‌ రైల్వే లైను వ్యూహానికి ప్రకృతి విఘాతం

ABOUT THE AUTHOR

...view details