చేపలు: వారానికి ఒకటి, రెండుసార్లు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. నెలసరి సమస్యలను అధిగమించడానికి ఇనుము ఎక్కువగా ఉండే చేపలు సహాయపడతాయి. వీటిల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల బారినపడకుండా చేపలు సాయపడతాయి.
పాలు, పెరుగు:ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు క్యాల్షియం లేమితో ఇబ్బంది పడుతున్నారు. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణంకావడానికి పెరుగు తోడ్పడుతుంది. పాలు, పెరుగులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
అవిసె గింజలు: వీటిల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు, ప్రొటీన్ ఇతర పోషకాలు, ఖనిజాలుంటాయి. నెలసరి సంబంధిత ఇబ్బందులను తొలగిస్తాయి. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్ల స్థాయిని తగ్గించి గుండెపోటు బారినపడకుండా సాయపడతాయి.
అమ్మాయిలూ మీ ఆహారంలో ఇవి ఉన్నాయా..? - మహిళల పోషకాహారం
ఇంటా, బయటా కష్టపడి పనిచేసే మహిళలకు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమెంతో. వేళకింత తిని భోజనం అయ్యిందనిపించకుండా ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
healthy food for women