- గుప్పెడు వేప ఆకుల్ని వేసి నీటిని మరిగించండి. ఆ నీటితో స్నానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు, మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి. కాసిన్ని నీళ్లల్లో వేప ఆకుల్ని వేసి మరిగించాక దానికి కాస్త తేనె, నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఆ నీటిని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
- రెండు వేపాకులు, కొన్ని గులాబీ రేకలు కలిపి ముద్దగా చేసుకుని దానికి చెంచా తేనె, కలబంద గుజ్జు కలిపి చర్మానికి రాసుకుంటే మృతకణాలు తొలగి మృదువుగా మారుతుంది. తాజాగానూ ఉంటుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేస్తుంటే ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మతత్వం గలవారు.. పావుచెంచా వేపపొడిలో కాస్త పెరుగు, తేనె కలిపి ముఖానికి పట్టిస్తే ఈ సమస్య దూరమవుతుంది.
- వేప, మందార ఆకుల్ని కలిపి ముద్దగా నూరి పెట్టుకోవాలి. దీనికి నానబెట్టి రుబ్బిన మెంతిపిండి ఒక కప్పు, ఆలివ్ నూనె చెంచా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా నెలకి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.
చర్మ, కేశ సంరక్షణకు ఆయుర్వేదం చెప్పే వేప చిట్కాలు
అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి... వేపతో చర్మ, కేశ సంరక్షణ చిట్కాలు ప్రయత్నిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
చర్మ, కేశ సంరక్షణకు ఆయుర్వేదం చెప్పే వేప చిట్కాలు