తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పాత ఫోనిస్తే... పేద పిల్లలకిస్తాం! - ఆన్​లైన్​ తరగతుల కోసం విద్యార్థులకు మొబైల్ ఫోన్లు

సంగీత.. ఓ ఆటోడ్రైవర్‌ కుమార్తె. బీకామ్‌ చదువుతోంది. ఆర్థిక స్థోమత లేక కజిన్‌ ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు వింటోంది. కజిన్‌కి క్లాసుంటే సంగీతకు ఆరోజు ట్యాబ్‌ ఉండదు. ‘మీకోసం ట్యాబ్‌ పంపిస్తున్నాం’ అని సంగీతకు ఓరోజు ఫోన్‌ వచ్చింది.. అంతే ఆమె ఆనందానికి అవధుల్లేవు. కెల్విన్‌.. వాళ్ల నాన్న ఇంటింటికీ తిరిగి వాటర్‌ క్యాన్స్‌ వేస్తుంటారు. ఉన్న ఒక్క ఫోన్‌ నాన్నకి అనివార్యం కావడంతో ఆన్‌లైన్‌ క్లాసులు వినలేని పరిస్థితి. ఈమధ్యనే కెల్విన్‌కు స్మార్ట్‌ఫోన్‌ అందింది. సంగీతా, కెల్విన్‌లకే కాదు మరెంతోమందికి డిజిటల్‌ పరికరాలు అందేలా చేస్తోంది 17 ఏళ్ల గుణీషా అగర్వాల్‌.

gunisha aggarwal is collecting old mobiles for online classes
పేద పిల్లలకు పాత ఫోన్లు

By

Published : Oct 17, 2020, 12:05 PM IST

Updated : Oct 17, 2020, 12:12 PM IST

ఇంటర్మీడియెట్‌ విద్యార్థులెవరైనా తమ చదువులూ, పోటీ పరీక్షల ప్రణాళికల్లోనే పూర్తిగా తలమునకలవుతారు. కానీ చెన్నైకు చెందిన గుణీషా అగర్వాల్‌ మాత్రం.. తను చదువుకుంటూనే మరెందరో చదువుకునేలా చేస్తోంది. ఆన్‌లైన్‌ చదువుల్ని పేద విద్యార్థులకు చేరువ చేసేందుకు డిజిటల్‌ పరికరాల్ని విరాళమివ్వాలంటూ పిలుపునిచ్చింది. దానికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌నీ ప్రారంభించిందీమె.

కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో చాలావరకు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. వీటికి హాజరు కావడానికి గుణీషాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ వాళ్లింట్లో పనిచేసే వ్యక్తి కుమార్తెకు మాత్రం డిజిటల్‌ తరగతులు వినేందుకు ఎలాంటి సాధనమూ లేకపోవడంతో గుణీషా తల్లి పాత ల్యాప్‌ట్యాప్‌ను ఇచ్చింది. దీన్ని గమనించిన గుణీషా తమిళనాడులో పేద విద్యార్థులకు ఎవరైనా తమ దగ్గరున్న పాత, కొత్త.. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లు అందించేలా వెబ్‌సైట్‌ను రూపొందించింది.

దాతలూ.. గ్రహీతల వేదిక

helpchennai.orgవెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్‌లేని పేద విద్యార్థులకు సాయం చేయాలనుకున్న దాతలు తమ వివరాలను నమోదు చేస్తే.. అవసరాల్లో ఉన్నవారి వివరాలు తెలుస్తాయి. లేదా ఆయా పరికరాలను గుణీషాకు పంపిస్తే ఆమే విద్యార్థులకు అందజేస్తుంది. ఇదంతా తెలుసుకున్న ‘మార్క్‌ మెట్రో అడ్వర్టైజ్‌మెంట్‌’ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.ఆనందకృష్ణ.. 100 ట్యాబ్స్‌, రూ.12 లక్షల ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకు 200 మందికి పైగా విద్యార్థులకు సాయం అందించింది గుణీషా.

Last Updated : Oct 17, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details