యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళను హత్య చేసిన కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్టలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా నేరం అంగీకరించాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీసీపీ నారాయణరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మహిళ హత్యకేసును ఛేదించిన భువనగిరి పోలీసులు
ఈ నెల 11న భువనగిరిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. యాదగిరిగుట్టలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన లక్ష్మిని హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అదే గ్రామానికి చెందిన ఆరేకుమార్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 11వ తేదీన అతను లక్ష్మిని యాదగిరిగుట్టకు తీసుకెళ్లి...భువనగిరి పట్టణ శివారులోని ఓ వెంచర్లో బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. వేరొకరితో చనువుగా ఉండడంతో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితునిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.