తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెంట్రోల్​బంకులో పనిచేసే వ్యక్తి హత్య... - nizamabad news

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలోని ఓ పెట్రోల్​ బంక్​లో పనిచేసే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. అర్ధరాత్రి సమయంలో బండరాయితో కొట్టగా... తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే మరణించాడు.

unknown persons murdered a man in balkonda
unknown persons murdered a man in balkonda

By

Published : Aug 25, 2020, 11:53 AM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్న రామకృష్ణ(50)ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. 44వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్‌ బంకులో రామకృష్ణ పని చేస్తున్నాడు. రాత్రి సమయంలో బంకులో ఒక్కడే విధుల్లో పాల్గొన్న రామకృష్ణ... క్యాబిన్‌లో పడుకున్నాడు.

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పడుకున్న వ్యక్తిపై దాడి చేశారు. బండరాయితో మోదగా... రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున చికిత్స కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరిలిస్తుండగా... మార్గమధ్యలోనే మృతి చెందాడు. రామకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్‌ గ్రామీణ సీఐ విజయ్‌కుమార్‌, బాల్కొండ ఎస్సై శ్రీహరిలు సందర్శించి వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి-సెప్టెంబర్​ 1 నుంచి మెట్రో రైల్​​ సర్వీసులు!

ABOUT THE AUTHOR

...view details