తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనంతపురంలో చిరుతల సంచారం.. మూడు మేకలు మృతి

అనంతపురం జిల్లా పామిడి మండలం దిబ్బసానిపల్లి గ్రామ సమీపంలోని కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం.. గడ్డి మేస్తున్న మూడు మేకలపై దాడి చేసి చంపేశాయి. శుక్రవారం కూడా చిరుతపులి సంచరించటంతో స్థానికులు చూసి ఆ దృశ్యాలను తమ చరవాణిలో బంధించారు.

ap news
అనంతపురంలో చిరుతల సంచారం...మూడు మేకలు మృతి

By

Published : Nov 20, 2020, 10:34 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలం దిబ్బసానిపల్లి గ్రామ సమీపంలోని కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తూ గ్రామాల ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. గురువారం.. మేకల గుంపును చూసిన చిరుత పులులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు మేకలు చనిపోగా మరికొన్ని గాయపడ్డాయి. ఇది గమనించిన కాపరి మనోజ్​ గట్టిగా కేకలు వేశాడు. దీంతో చిరుతపులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుని పరారయ్యాడు.

శుక్రవారం కూడా చిరుతపులి సంచరించటం చూసిన స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిలో బంధించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి చిరుతపులి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

అనంతపురంలో చిరుతల సంచారం...మూడు మేకలు మృతి

ఇవీచూడండి:చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details