హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటుంది. సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటి దగ్గరలో ఉంటున్న... జోసఫ్, నవీన్ రెడ్డి, రాములు... సదరు విద్యార్థినితో స్నేహంగా మెలిగారు.
ఈనెల 5వ తేదీన టర్మ్ ఫీజు చెల్లించేందుకు విద్యార్థిని కళాశాలకు వెళ్లింది. ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి... తన పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాడు. నిజమేనని నమ్మిన సదరు యువతి వారి వెంట వెళ్లింది. కేపీహెచ్‌బీ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లిన నిందితులు... ఆమెతో మత్తుమందు కలిపిన కేక్ తినిపించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
బాధిత యువతి అనారోగ్యానికి గురవ్వడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు అక్కడే ఆందోళన చేపట్టారు.
లాడ్జి వ్యవహారశైలిపైనా అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హోటళ్లు, లాడ్జీలపై నిరంతర నిఘా ఉంచాలని.. పలువురు కోరుతున్నారు.
స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు ఇవీచూడండి:హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. బర్త్‌డేకి పిలిచి అత్యాచారం..