తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్త ప్రాణం తీసిన భార్య వివాహేతర సంబంధం - మేడ్చల్​ జిల్లా వార్తలు

వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన భార్యతో సంబంధం ఆపాలంటూ చెప్పిన భర్తను భార్య ప్రియుడు కత్తితో పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా ఎల్లమ్మబండలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

The police who cracked the murder case
భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

By

Published : Dec 15, 2020, 3:38 PM IST

మేడ్చల్ జిల్లా ఎల్లమ్మబండలో మహమ్మద్ అన్సార్ అహ్మద్ (40) తన భార్య చాంద్ బీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటి పక్కనే ఉన్న ఇమ్రాన్.. చాంద్ బీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న చాంద్ బీ భర్త.. ఇమ్రాన్​ను మందలించాడు. అహ్మద్​పై కక్ష పెంచుకున్నాడు ఇమ్రాన్. అహ్మద్​పై దాడి చేసి కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు ఇమ్రాన్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details