వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆటో డ్రైవర్ ప్రవీణ్ తన ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తగులబెట్టాడు. అనంతరం ఠాణా లోపలికి వెళ్లి.. పద్మసాయి ఫైనాన్స్ వారి వేధింపులు భరించలేక ఏమిచేయలో తెలియని పరిస్థితిలో ఈ పని చేశానని తెలిపాడు.
వేధింపులు తాళలేక.. స్టేషన్ ఎదుటే ఆటోను తగలబెట్టేశాడు!
ఆటో డ్రైవర్ ప్రవీణ్ తన ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తగులబెట్టాడు. ఫైనాన్స్ వారి వేధింపులు భరించలేక ఈ పని చేశానని ప్రవీణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో జరిగింది.
పోలీస్ స్టేషన్ ముందే ఆటోను తగులబెట్టుకున్న డ్రైవర్!
పద్మసాయి ఫైనాన్స్ ద్వారా ప్రవీణ్ ఆటో కొనుక్కున్నాడు. కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. 4నెలలుగా కిస్తీ కట్టకపోవడంతో ఫైనాన్స్ వారి వేధింపులు ఎక్కువయ్యాయని.. మానసిక వేదనకు గురై తన ఆటోను తగులబెట్టుకున్నానని వాపోయాడు. తనలాంటి పరిస్థితిలో ఎందరో ఆటో డ్రైవర్లు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఇదీ చూడండి: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి