ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంకలో ఈనెల 14న కిడ్నాపైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి(సంయుక్త) అపహరణకు పాల్పడిన బాలిక తల్లి వెంకటలక్ష్మితో సహా ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీలో బాలిక కిడ్నాప్ కేసు ఛేదన... ఆరుగురి అరెస్టు - ap news
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా శానపల్లిలంకలో కిడ్నాప్‌కు గురైన బాలికను పోలీసులు రక్షించారు. విజయవాడలో చిన్నారిని రక్షించి, అపహరణకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఏపీలో బాలిక కిడ్నాప్ కేసు ఛేదన... ఆరుగురి అరెస్టు
వెంకటలక్ష్మి, రవితేజ మధ్య మనస్పర్థల వల్ల సంయుక్త తండ్రి వద్ద ఉంటోంది. ఎలాగైనా సంయుక్తను తన వెంట తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో... వెంకటలక్ష్మి ఈ దురాగతానికి పాల్పడింది.
ఇదీచదవండి:అక్రమ రవాణా చేస్తున్న 10 మంది అరెస్ట్