కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గుడ్సబ్(52) మేస్త్రీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే తన కొడుకు అబ్దుల్, రాజనర్సు అనే వ్యక్తితో కలిసి పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న వీరిని చుక్కపూర్ వద్ద గుర్తుతెలియని కారు ఢీ కొట్టింది. దానితో గుడ్సబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజనర్సును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అబ్దుల్‌కు కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు.
రెండు ప్రమాదాలు.. మూడు ప్రాణాలు..
కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దానితో వారివారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
రెండు ప్రమాదాలు.. మూడు ప్రాణాలు
అలాగే నిజాంసాగర్ చౌరస్తా వద్ద కారు-ద్విచక్ర వాహనాన్ని ఢీ కొని చాకలి గంగయ్య అనే వ్యక్తి దుర్మణం చెందాడు. ఇలా ఒకే రోజు జిల్లాలోని రెండు వేరువేరు చోట్ల రోడ్డుప్రమాదాల బారిన పడి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష