కామారెడ్డి జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కూలీల ట్రాక్టర్ బోల్తా పడి.. ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నేరంగల్ గ్రామం నుంచి మద్నూర్ మండలం డోంగ్లి గ్రామానికి 25 మంది ట్రాక్టర్లో కూలీ పనుల కోసం వచ్చారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని డోంగ్లీ గ్రామానికి సమీపంలో ఉండటం వల్ల నేరంగల్ కూలీలు సోయాలో కలుపు తీసేందుకు వచ్చారు. కూలీపనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో.. మద్నూర్ మండలం సమీపంలో మూలమలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.