తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 9:28 PM IST

ETV Bharat / jagte-raho

దారి దోపిడీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

జాతీయ రహదారులపై వాహనాలు ఆపి దోపిడీకి పాల్పడుతూ... వాహనచోదకులపై దాడి చేస్తున్న అంతర్​రాష్ట్ర దోపిడి ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల 30వేల నగదు, కారు, మూడు చరవాణులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.

దారి దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
దారి దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను నిర్మల్​ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2 లక్షల 30 వేలు నగదు, కారు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

ఎలా దొరికారంటే...

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన షేక్ కరీముల్లా మేకల వ్యాపారం చేస్తుంటాడు. గత అక్టోబరు నెల 18న తన డ్రైవర్ ఇర్ఫాన్, భద్రరావులను ఉత్తరప్రదేశ్​లో మేకలు కొనుగోలు చేసి తీసుకురావాలని ఐచర్ వాహనంతో పాటు రూ.24 లక్షలు ఇచ్చి పంపాడు. అక్టోబర్ 19న నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిలో వారిని అడ్డగించిన దుండగులు... ఇర్ఫాన్​, భద్రరావుపై దాడి చేసి రూ.24లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆదిలాబాద్​లో ఆస్పత్రిలో చేర్పిచారు. ఈ ఘనటపై ఈనెల 7న షేక్​ కరీముల్లా మామడ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ఇర్ఫాన్​ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. డ్రైవర్ ఇర్ఫాన్ తన సమీప బంధువుతో కలిసి రాజమండ్రిలోని ఇద్దరు రౌడీషీటర్లతో పథకం వేశాడు. కారును అద్దెకు తీసుకొని సినీఫక్కీలో బూరుగుపల్లి గ్రామం వద్ద వాహనాన్ని అడ్డగించి దారి దోపిడీ చేశారు. ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!

ABOUT THE AUTHOR

...view details