తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనంతలో యువతి కిడ్నాప్​.. అసలు సంగతేంటంటే...?

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. యువతి సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే యువతి ఇష్టపూర్వకంగానే వెళ్లిందా... లేక కిడ్నాప్ అయిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కిడ్నాప్​కు గురైన యువతి ఇచ్చిన స్టేట్​మెంట్​ మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

lady-kidnap-case-chaged-by-the-Anantapur am-police
అనంతలో యువతి కిడ్నాప్​.. అసలు సంగతేంటంటే...?

By

Published : Nov 4, 2020, 2:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో యువతి కిడ్నాప్ మూడు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్​కు గురి కావడం సంచలనం రేపింది. కిడ్నాపర్లు తిరుపతి వైపు వెళ్లారని కొందరు, కర్నూలు వైపు వెళ్లారని మరికొందరు చెప్పడం.. కిడ్నాప్​ చేసింది కానిస్టేబుల్​ కావడం మరింత సీరియస్​గా పోలీసులు కేసును తీసుకున్నారు. ఎట్టకేలకు అనంతలో కిడ్నాప్ అయిన యువతి కర్నూలులో ప్రత్యక్షమైంది. సినీ ఫక్కీలో కిడ్నాప్, ఆ తరువాత పోలీసుల గాలింపుకు 24 గంటల్లో తెరపడింది.

అనంతలో యువతి కిడ్నాప్​.. అసలు సంగతేంటంటే...?

అసలు ఏం జరిగింది...

అనంతపురంలోని ఓ యువతి సోమవారం కుటుంబసభ్యులతో ఓ వివాహ వేడుకకు వెళ్లింది. అక్కడే తన అత్తతో కలిసి మధ్యాహ్నం మూడున్నర గంటలకు టైలర్ వద్దకు వెళ్తుండగా కిడ్నాప్​నకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటనతో షాక్​కు గురైన యువతి అత్త.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సినీ ఫక్కీలో ఛేజింగ్..

యువతిని కిడ్నాప్​ చేసింది.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకి చెందిన కానిస్టేబుల్ భగీరథ అని తెలుసుకున్నారు పోలీసులు. ఏడాదిన్నర క్రితం యువతికి, భగీరథతో నిశ్చితార్థం జరిగింది. అయితే భగీరథకు ఇదివరకే పెళ్లి అయిందన్న కారణంతో సరిగ్గా ముహుర్తం రోజే వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అప్పట్లో దీనిపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు భగీరథే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. తాడిపత్రిలో వాహనాల తనిఖీ చేస్తుండగా గమనించిన కిడ్నాపర్లు.. వాహనాన్ని అక్కడే వదిలేసి పొలాల్లోకి పారిపోయారు. అక్కడి నుంచి జస్ట్ వాహనాన్ని అద్దెకు తీసుకొని తిరుపతి వైపు వెళ్లారన్న సమాచారంతో, పోలీసులు.. రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని తిరుపతిలో గాలింపు చేపట్టారు. ఇటు కానిస్టేబుల్ సొంత ప్రాంతమైన కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. పూర్తిగా మూడు జిల్లాల పోలీసులు దీనిపై ఫోకస్ పెట్టి, చివరికి బనగానపల్లి పోలీసులు వారిని పట్టుకున్నారు.

భగీరథను అదుపులోకి తీసుకొని...
భగరీథను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతిని తమ సంరక్షణలో ఉంచారు. దీనిపై సమాచారం అందుకున్న అనంతపురం నాల్గొ పట్టణ పోలీసులు బనగానపల్లి చేరుకున్నారు. అయితే యువతిని కిడ్నాప్ చేశారా.. లేక ఇష్టపూర్వకంగా వెళ్లిందా అన్నది తేలాల్సి ఉంది. యువతి ఇచ్చే స్టేట్​మెంట్​ను బట్టి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...బాలుడు​ కిడ్నాప్​ డ్రామా- రూ.50కోట్లు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details