ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్‌లో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. తెలుపు రంగు ఓమిని వాహనంలో వచ్చిన దుండగులు ఇస్త్రీ దుకాణానికి వెళ్లొస్తున్న బాలుడికి కత్తి చూపి అపహరించడానికి యత్నించారని బాధితులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కలిసి వాహనాన్ని వెంబడించినా ఫలితం లేదని అన్నారు. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కిడ్నాప్ కలకలం... బాలుడికి కత్తి చూపి బెదిరించారు! - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్లో కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది. దుకాణానికి వెళ్లొస్తున్న చిన్నారికి కత్తి చూపి బెదిరించారని... భయంతో తాను పరుగులు పెట్టినట్లు బాలుడు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వాహనాన్ని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది.
కిడ్నాప్ కలకలం... బాలుడికి కత్తి చూపి బెదిరించారు!
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ నుంచి పెళ్లి కోసం తమ బంధువుల ఇంటికి వచ్చామని, తమ బాలుడు కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం అదృష్టమని బాలుడి తండ్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కల్లు కలకలం: ఆస్పత్రుల్లో 100 మంది... ముగ్గురి పరిస్థితి విషమం