తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కరవైన మానవత్వం.. కర్కశంగా మనుషులు

మనుషుల్లో రోజురోజుకు మానవత్వం కరవవుతోంది. తోటి వారితో కర్కశంగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికపరంగా ఎంతో దూసుకెళుతున్న ఈ రోజుల్లో శవం ఇంటి ముందు నుంచి వెళితే అరిష్టం అంటూ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. మృతదేహాన్ని ఇంటి ముందు నుంచి వెళ్లనివ్వకుండా ఆపిన అమానుష ఘటన వరంగల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

మృతదేహాన్ని రోడ్డుపైన పెట్టిన బంధువులు

By

Published : Mar 13, 2019, 7:37 AM IST

Updated : Mar 13, 2019, 8:19 AM IST

మృతదేహాన్ని రోడ్డుపైన పెట్టిన బంధువులు
వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో అఖిల అనే మహిళ గత రెండు రోజుల కిందట కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్‌మార్టంఅనంతరం ఆమె మృతదేహన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. తమ ఇంటి ముందు నుంచి తీసుకెళితే అరిష్టం అని.. కాలనీ వెంట తీసుకెళ్లవద్దని జంపయ్య అనే వ్యక్తి ముళ్ల కంప అడ్డుగా వేశారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అఖిల మృతదేహన్ని రోడ్డుపైనే పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Last Updated : Mar 13, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details