నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారిస్తే... చేసిన నేరాలను ఒప్పుకున్నారని దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి తెలిపారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అంతరాష్ట్ర దొంగల ముఠాకు నల్గొండ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. నిందితుల నుంచి నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ట్రాలీలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
అంగడిపేట స్టేజి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ట్రాలీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ దొంగలంతా ఆంద్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారిపై గుంటూరు జిల్లాలో పలు చోరీ కేసులున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు.
గత కొద్దీ రోజుల క్రితం పెద్ద అడిశర్లపల్లి మండలంలోని దుబ్బతండాకు చెందిన మోహన్ తన ట్రాక్టర్ పోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే అంతరాష్ట్ర దొంగలు పట్టబడ్డారని చెప్పారు.