తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోషించలేక ఐదురోజుల శిశువును అమ్మేసింది!

మల్లుపల్లిలో శిశు విక్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీకా వేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందికి తల్లిదండ్రుల తీరుతో అనుమానం రాగా అసలు విషయం బయటపడింది. కుటుంబ పోషణ భారమవుతుందని 5 రోజుల పసికందును విక్రయించినట్లు తల్లి అంగీకరించింది.

infant-sold-by-her-parents-due-to-poverty-at-mallupally-in-siddipet-district
మల్లుపల్లిలో శిశు విక్రయం... ఆలస్యంగా వెలుగులోకి!

By

Published : Jan 30, 2021, 6:52 PM IST

సిద్దిపేట జిల్లాలో శిశు విక్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు 15రోజుల క్రితం ఆడ శిశువు జన్మించింది. కుటుంబ పోషణ భారమవుతుందని 5 రోజుల పసికందును మరొకరికి విక్రయించారు. శిశువుకు టీకా వేయడానికి వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రుల తీరుతో వారికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా... విచారణలో శిశువును విక్రయించినట్లు తేలింది.

ఆ మహిళకు నలుగురు సంతానంతో పాటు ఆడశిశువు కావడంతో కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో శిశువును ఇష్టపూర్వకంగానే తమ బంధువులకు ఇచ్చామని శిశువు తల్లి వెల్లడించింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన వారికి విక్రయించినట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే శిశువును తీసుకొచ్చి అప్పగించాలని వారికి ఫోనులో సమాచారం ఇచ్చారు. పోషణకు ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అన్నారు. శిశువును వేరొకరికి అప్పగించడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇదీ చదవండి:నెక్లెస్​రోడ్డులో నర్సరీ... సందర్శకుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details