మాజీ రౌడీషీటర్‌పై దుండగులు కత్తులతో దాడిచేసి హత్యకు పాల్పడిన ఘటన సనత్ నగర్ పీఎస్ పరిధి బోరబండలోని ఆర్కే సొసైటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఫిరోజ్ ఖాన్‌ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
నగరంలో మాజీ రౌడీ షీటర్ దారుణ హత్య
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మాజీ రౌడీ షీటర్ ఫిరోజ్ ఖాన్‌పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు.
నగరంలో మాజీ రౌడీ షీటర్ దారుణ హత్య
ఫిరోజ్ ఖాన్ గతంలో వాహిద్ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన సనత్‌నగర్ పోలీసులు అతని హత్యకు పాత కక్షలే కారణమా? లేక మరేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరి అరెస్ట్