తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ

By

Published : Sep 29, 2019, 10:03 AM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రవీంద్ర నగర్​లో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని... కాలనీలో ఎవరైనా అనుమానితంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. తనిఖీల్లో మొత్తం 120 మంది పోలీస్​ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details