తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హైదరాబాద్ లోటస్‌ పాండ్‌ పార్కులో మృతదేహం లభ్యం

హైదరాబాద్ లోటస్‌ పాండ్‌ పార్కులో ఉన్న నీటి గుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు టోలీచౌకికి చెందిన వహిదుద్దీన్‌ ఖాన్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కరోనా కారణంగా మూతపడిన ఈ పార్కును శనివారమే తెరిచారు.

dead body identified at lotus pond park in hyderabad
హైదరాబాద్ లోటస్‌ పాండ్‌ పార్కులో మృతదేహం లభ్యం

By

Published : Oct 25, 2020, 3:12 PM IST

హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని లోటస్‌ పాండ్‌ పార్కులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పార్కులోని నీటి గుంటలో మృతదేహాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలుపగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.

మృతుడు టోలీచౌకికి చెందిన వహిదుద్దీన్‌ ఖాన్‌(35)గా బంజారాహిల్స్‌ పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే కొవిడ్ కారణంగా మూతపడిన ఈ పార్కును శనివారమే తెరవడం గమనార్హం.

ఇదీ చూడండి: నువ్వే లేని లోకానా... నేనుండలేను

ABOUT THE AUTHOR

...view details