ఖమ్మం నగరం ఒకటవ డివిజన్లో ఓ యువకుడి మృతికి సంబంధం ఉందంటూ స్థానిక కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్‌పై యువకుడి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో కార్పొరేటర్ కారు ధ్వంసమైంది. కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి ఆందోళనకారులకు అడ్డుగా నిల్చున్నారు.
యువకుడి మృతి... కార్పొరేటర్‌పై బంధువుల దాడి
ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఆగష్టు 16న ఓ యువకుడు మృతి చెందాడు. అతని మృతికి స్థానిక కార్పొరేటర్ కారణమని ఆరోపిస్తూ యువకుడి బంధువులు కార్పొరేటర్‌పై దాడి చేశారు.
యువకుడి మృతి... కార్పొరేటర్‌పై దాడి చేసిన బంధువులు
ఆగస్టు 16న కైకొండాయి గూడెంకు చెందిన తేజావత్ ఆనంద్ తేజ్ అనే యువకుడిని రామ్మూర్తి నాయక్ తన ఇంట్లో పనికి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. రామ్మూర్తి నాయక్ తన ఇంట్లో లంక బిందెల కోసం పూజలు చేస్తూ తన కుమారుడిని బలి ఇచ్చాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి