నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖ సైట్ ఇంజినీర్ స్వామి నాయక్ ఏసీబీ వలలో చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఆశ్రమ పాఠశాలలో నీటి సంపు నిర్మాణం జరిపిన గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా... తెలంగాణ విద్యా శాఖ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్పొరేషన్ సైట్ ఇంజినీర్ ఇస్లావత్ స్వామి నాయక్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నేరేడుగొమ్మ మండలం బచ్చాపురం గ్రామానికి చెందిన గుత్తేదారు కేతావత్ సోమ్లా నాయక్ పెద్దవూర మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 2019లో మురుగు కాలువ, నీటి ట్యాంకు నిర్మించారని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. అందుకు రూ.4,25,000 పనులు పూర్తి చేయగా... ఏడాది కాలంగా సైట్ ఇంజనీర్ స్వామి నాయక్ బిల్లు చేయకుండా నిలిపివేశారన్నారు. రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు.