ఆన్‌లైన్ తరగతుల కోసం సెల్‌ఫోన్ కొనివ్వలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలం తిర్మాలపూర్ గ్రామానికి చెందిన రఘుప్రసాద్ అనే బాలుడు ఆన్‌లైన్ తరగతుల కోసం చరవాణి కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. దసరా పండుగకి కొనిస్తామని వారు చెప్పడంతో ఇంట్లో ఉన్న వేరే సెల్‌ఫోన్‌తో తరగతులు వెళ్లదీశాడు.
పండుగ వచ్చింది.. ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను రఘు అడగడంతో పత్తి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో కొంటామని చెప్పారు. మనస్తాపం చెందిన రఘు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.