చేపల వేటకు వెళ్లిన బాలుడు ప్రమాద వశాత్తు కాల్వలో పడి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముక్కాముల యాదలక్ష్మి, చంద్రయ్యల ఒక్కగానొక్క కొడుకు శివరాజు(16) స్నేహితులతో కలసి సమీపంలోని దేవాదుల కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల కొంత దూరం కొట్టుకు పోయాడు.
చేపల వేట కోసమని వెళ్లిన బాలుడు విగతజీవిగా దర్శనం...
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన బాలుడు... విగత జీవిగా కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు చేతికందే సమయంలో మృతి చెందటాన్ని తల్లిదండ్రులు ఓర్చుకోలేక గుండెలవిసేలా రోధించారు.
16 YEARS BOY DIED IN RIVER AT ANANTHARAM
సమాచారాన్ని కుటుంబ సబ్యులకు తెలియజేయగా... హుటాహుటిన కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువ వెంట గాలించగా బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో విగతజీవిగా కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు కాల్వలోపడి మరణించటం వల్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శివరాజు ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడని కుటుంబసభ్యులు తెలిపారు.